అల్లం, దాల్చిన చెక్క పేరు వినగానే మనకు గుర్తుకువచ్చేది బిర్యాని. మసాలా కూర వండాలన్న, కూరకి మంచి వాసన రావాలన్న ఇవి రెండు లేనిదే టేస్ట్ రాదు. అయితే విటిని కేవలం వంటలోకి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఇవి చేసే పనులు అంతా ఇంతా కాదు. ఎన్నో రోగాలకు వీటితో చెక్ పెట్టవచ్చు. కొత్త వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడవచ్చు కూడా. వీటి ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి గల ఒక సుగంధ ద్రవ్యం. ఇవి చక్కని సుగంధాన్ని కలిగి ఉంటాయి. దాల్చిన చెక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతే కాక సౌందర్యాన్ని కూడా పెంపొందింపజేస్తుంది. దాల్చిన చెక్క పొడిని వాడటం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీనిలో ఉండే యాంటి ఆక్సిడెంట్స్ దీని అతి ముఖ్యమైన లక్షణం. దీన్ని వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు, చుండ్రు తగ్గుతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. రకరకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్ ను పెంచే గుణాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. దీన్ని ఆహారంలో తీసుకోవడం ద్వారా రక్త సరఫరా మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దాల్చినచెక్క అధిక కొవ్వు కలిగి ఉండే ఆహారం వల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్క శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. గ్లాసుడు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఇలా మూడు నెలల పాటు చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల అది కీళ్ళ నొప్పులు కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. దాల్చిన చెక్కతో తయారు చేసిన నూనెను మర్దన చేయడం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వలన జలుబు, దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే అల్లం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.
మనిషి శరీరంలో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. వాంతులు తగ్గటానికి కూడా అల్లం పనిచేస్తుంది. అలర్జీల వంటివి తగ్గుతాయి. హృదయానికి రక్త ప్రసరణ సక్రమంగా అందుతుంది. నెలసరి సమయంలో కడుపునొప్పితో బాధ పడుతున్న వారు ఓ కప్పు అల్లం చారులో చెంచా తేనె వేసి తాగితే ఫలితం ఉంటుంది. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కోసి , నిమ్మరసం, ఉప్పు కలిపి ఒక నెల రోజులు నిల్వ చేసి తరువాత దానిని ఎండలో పెట్టి ఒక్కొక్క ముక్క తీసుకుంటే దాని ప్రభావం నోటిలో ఉండే అల్సర్స్, చిగుల్ల మధ్య దాగి ఉండే క్రిములని నిర్మూలిస్తుంది.