బాహుబలి ఘన విజయం తర్వాత ప్రభాస్ తెలుగు హీరో మాత్రమే కాదు.. పాన్ ఇండియా హీరో అయిపోయాడు. దీనికి తగ్గట్టే.. కథలు ఎంచుకుంటున్నాడు. బడ్జెట్ 300 కోట్లకు తగ్గకుండా జాగ్రత్తపడుతున్నాడు. మరోవైపు.. ఎవరూ చేయని సాహసం కూడా చేస్తున్నాడు డార్లింగ్.
బాహుబలి వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ప్రభాస్ నటించిన ఎడ్వెంచర్ మూవీ సాహో ఫ్లాప్ అయినా.. సాహసాలు చేయడంలో ఏమాత్రం వెనకాడడం లేదు. ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలున్నాయి. రాధే శ్యామ్ షూటింగ్ రీసెంట్గా ఇటలీ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. నాగ అశ్విన్ మూవీ.. ఆదిపురుష్ లైన్లో వున్నాయి. ఒకదానితో మరోటి పోల్చి చూస్తే.. కథలోగానీ.. గెటప్లోగానీ.. ఏమాత్రం పోలిక వుండదు. మూడూ మూడే డిఫరెంట్
ప్రస్తుతం సెట్స్‌పై వున్న రాధే శ్యామ్ విషయానికొస్తే.. వర్షం తర్వాత ప్రభాస్ చేస్తున్న ప్రేమ కథా చిత్రమిది. ఈమధ్యకాలంలో ప్యూర్ లవ్ స్టోరీ చేయలేదు. ప్రభాస్ లవర్‌బాయ్ అవతారం ఎత్తడం అందరికీ కొత్తగానే వుంటుంది. ఇక నాగ అశ్విన్ మూవీ విషయానికొస్తే.. సైన్స్ సోషియా ఫిక్షన్ మూవీగా రూపొందుతోంది. ఆదిత్య 369… పుష్ఫక విమానం వంటి డిఫరెంట్ మూవీస్ ఇచ్చిన సింగీతం శ్రీనివాసరావు నాగ అశ్విన్ మూవీకి మెంటర్‌గా వ్యవహరిస్తూ.. కథ, కథనంలో సాయపడుతున్నాడు. ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడిగా కనిపిస్తాడు. రామాయణంలోని ఏ ఘట్టాన్ని చూపిస్తారోగానీ.. ఈతరం హీరోల్లో మైథలాలిజకల్ మూవీ చేస్తూ సమ్‌థింగ్ స్పెషల్‌గా కనిపిస్తున్నాడు ప్రభాస్.