వినాయకుని కుడుములతో ఇన్ని ఉపయోగాలా? తెలిస్తే వదలిపెట్టరంతే!

-

సాధారణంగా ఆవిరి కుడుములంటే బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి.. వంటివి వాడతాం. అయితే గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మోదకాలను తింటే ఎన్నో ప్రయోజనాలట అవేంటో తెలుసుకుందాం..

కుడుములు

మోదకాల తయారీలో వాడే నెయ్యి పేగు శ్లేష్మ పొరను పునర్నిర్మిస్తుంది. తద్వారా పొట్టలోని విషపదార్థాలు సులభంగా బయటికి వెళ్లిపోయి మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందచ్చు.

 

కొబ్బరిలోని మీడియం చెయిన్ ట్రై-గ్లిజరైడ్స్ రక్తప్రసరణను అదుపులో ఉంచడంలో సహకరిస్తాయి. తద్వారా గుండె పదిలంగా ఉంటుంది.

కుడుములు

కొబ్బరిలోని ప్లాంట్ స్టెరాల్స్, స్టఫింగ్ కోసం ఉపయోగించే డ్రైఫ్రూట్స్.. వంటివి శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి.. మంచి కొవ్వును పెంచుతాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.

 

బియ్యప్పిండి, కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుముల్ని ఆవిరిపై ఉడికించి, నెయ్యిలో నంజుకొని తింటే ఆ రుచి అమోఘం. అయితే ఈ పదార్థాలన్నీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి.. కాబట్టి పూర్తి సురక్షితం. మధుమేహంతో బాధపడే వారికైతే ఇవి మరీ మంచివి. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయుల్ని స్థిరంగా ఉంచడంలో తోడ్పడతాయి.

 

నెయ్యిలోని బ్యుటిరికామ్లం శరీర కణజాలాల్లోని వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల వాపును తగ్గించి ఆర్థ్రైటిస్ సమస్యను దూరం చేస్తుంది.

వినాయక

నెలసరికి ముందు మహిళల్లో ఆహారపు కోరికలు (పీఎంఎస్) ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. తద్వారా తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఈ కోరికల్ని తగ్గించడంలో బియ్యంలోని విటమిన్ ‘బి1’ సహకరిస్తుంది. అలాగే బియ్యప్పిండి రక్తంలోని చక్కెరను స్థిరంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

 

వయసు పైబడిన ఛాయల్ని రూపుమాపి.. నవయవ్వనంగా కనిపించేందుకు, థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచేందుకు ఈ రుచికరమైన కుడుములకు సాటి మరొకటి లేదు.

వినాయక

బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నారా? అయితే కుడుములు అందుకు సహకరిస్తాయి. వీటి తయారీకి వాడిన పదార్థాలన్నీ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని కలిగి ఉంటాయి. మంచి కొవ్వులు, పోషక విలువల్ని నింపుకొన్న ఈ మోదకాలను వద్దనడానికి కారణమే లేదు. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యానికి.. దృఢత్వానికీ ఈ వంటకం చక్కగా ఉపయోగపడుతుంది- అంటున్నారు పోషకాహార నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news