గుడ్ న్యూస్.. ఆ రైతులు రెండు కాదు రూ. 4 వేలు పొందొచ్చు..!

-

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా చాలా మంది రైతులు ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇప్పటి వరకు 11 విడతలు డబ్బులు పడ్డాయి. ఇక ఇప్పుడు త్వరలో 12వ విడత డబ్బులు పడనున్నాయి. అయితే ఈ స్కీమ్ ని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకు రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం రైతులకు 6 వేల రూపాయలను ఈ స్కీమ్ కింద ఇస్తోంది.

farmers

ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మూడు విడతల రూపంలో జమ చేస్తారు. ఇక ఇది ఇలా ఉంటే విడత డబ్బులు రాని అన్నదాతలు చాలా మంది వున్నారు. అయితే 11వ విడత డబ్బులు ఖాతాలో రాకపోవడానికి కారణాలు చాలా వున్నాయి. ఈ డబ్బులు పొందని వాళ్ళు 12వ విడతతో పాటు 11వ విడత డబ్బులను కూడా పొందొచ్చు.

ఆ డబ్బులు పొందని రైతులు ఇప్పుడు రెండు వేలకు బదులు రూ.4 వేలు పొందొచ్చు. ఈ స్కీమ్ కింద రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదంటే పీఎం కిసాన్ యోజనలో రిజిస్టర్ చేసేటప్పుడు ఏదైనా సమాచారాన్ని ఫిల్ చేయడంలో తప్పులు లేదా చిరునామా లేదా బ్యాంక్ ఖాతా సమాచారం తప్పవ్వడం వలన జమ అవ్వకపోవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరెక్షన్ పెండింగ్‌లో ఉన్నా డబ్బులు రావు. బెనిఫిషియరీ స్టేటస్‌ చూడాలంటె pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి.. కుడి వైపున ఉన్న పూర్వ మూలలోకి వెళ్లి బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేసి చూడచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news