క‌డుపులో మంట‌గా ఉంద‌ని అంటాసిడ్‌ల‌ను ఎక్కువ‌గా వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

-

మ‌ద్యం అతిగా సేవించ‌డం… ఒత్తిడి.. జీర్ణ స‌మ‌స్య‌లు.. మ‌సాలాలు, కారం ఉన్న ప‌దార్థాలు ఎక్కువ‌గా తిన‌డం.. అల్స‌ర్లు.. త‌దిత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న‌లో అధిక శాతం మందికి క‌డుపులో మంట‌గా అనిపిస్తుంటుంది. అయితే క‌డుపులో మంట‌కు మెడిక‌ల్ షాపుల్లో దొరికే అంటాసిడ్ల‌ను చాలా మంది వాడుతుంటారు. కొంద‌రు టాబ్లెట్లు వేసుకుంటే, కొంద‌రు అంటాసిడ్ సిర‌ప్‌ల‌ను తాగుతుంటారు. అయితే నిజానికి అంటాసిడ్ల‌ను ఎక్కువ‌గా వాడ‌డం మంచిది కాదు. వాటితో మ‌న‌కు అనేక దుష్ప‌రిణామాలు క‌లుగుతాయి.

using antacids too much then it is not safe to you

అంటాసిడ్లు స‌హ‌జంగానే క‌డుపులో మంట‌ను చాలా తేలిగ్గా, త్వ‌ర‌గా త‌గ్గిస్తాయి. దీంతో క‌డుపులో మంట అనిపించ‌గానే చాలా మంది ఆ సిర‌ప్‌ల‌ను డాక్ట‌ర్ ప్రిస్క్రిప్ష‌న్ లేకుండానే మెడిక‌ల్ షాపుల్లో కొని తీసుకువచ్చి తాగుతుంటారు. అయితే అంటాసిడ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో అవి ప‌నిచేయ‌కుండా పోతాయి. దీంతో స‌మ‌స్య ఇంకా ఎక్కువ‌వుతుంది. క‌డుపులో మంట పెరుగుతుంది. అప్పుడు అంటాసిడ్ల‌ను ఎన్నింటిని తీసుకున్నా ఫ‌లితం ఉండ‌దు.

ఇక అంటాసిడ్ల‌ను అధికంగా వాడ‌డం వ‌ల్ల చాలా త్వ‌ర‌గా అల‌సిపోతుంటారు. ఎప్పుడూ నీర‌సంగా క‌నిపిస్తారు. ఒంట్లో శ‌క్తి లేన‌ట్లు అనిపిస్తుంది. ఏ ప‌ని చేయాల‌న్నా అల‌స‌ట‌గా అనిపిస్తుంది. అలాగే ఒక్కోసారి విరేచ‌నాలు కూడా సంభ‌విస్తాయి. ఇక కొంద‌రికి తీవ్ర‌మైన మ‌ల‌బ‌ద్ద‌కం ఏర్ప‌డుతుంది. మ‌లంలో రక్తం కూడా ప‌డుతుంది. కొంద‌రిలో విరేచ‌నం చాలా క‌ష్టంగా అవుతుంది. క‌నుక అంటాసిడ్ల‌ను ఎక్కువ‌గా వాడేవారు వాటి వాడ‌కాన్ని నియంత్రిస్తే మంచిది. లేదా డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వాటిని వాడుకోవ‌చ్చు..!

Read more RELATED
Recommended to you

Latest news