పవన్ కళ్యాణ్ “ఉస్తాద్ భగత్ సింగ్” ఆఫీసియల్ అప్డేట్

-

పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ రోజు తన లేటెస్ట్ సినిమా కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా కాలం నుండి ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా ఇక రావడం కష్టమేమో అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా విడుదల చేసిన పవన్ కళ్యాణ్ పోస్టర్ తో ఫ్యాన్స్ కు పూనకం వచ్చిందని చెప్పాలి. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుంగీతో , స్పెక్ట్స్ వేసుకుని చేతిలో కట్టి పట్టుకుని మాస్ లుక్ తో అదరగొట్టాడు. కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.. ఇక గబ్బర్ సింగ్ తో హిట్ కొట్టిన హరీష్ శంకర్ రెండవ సారి హిట్ కొడతాడా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

ఇందులో పవన్ కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news