50వేలకు ఒక్క ఓటు తగ్గినా.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా : ఉత్తమ్‌

-

కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సూర్యాపేటకు జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువా కప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుండి 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డి 3 వందల ఎకరాలు అక్రమంగా సంపాందించారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమన్వయంతో పని చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుతం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. కేటీఆర్, కవిత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు సరికాదని…మీది ఆస్థాయి కాదని ఉత్తమ్ మండిపడ్డారు. ఇప్పుడు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టు అని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version