ఉత్తమ్ మాటలు ఉత్తవే…సివిల్ సప్లై శాఖలో వందల కోట్ల అవినీతి : మహేశ్వర్ రెడ్డి

-

బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మంత్రి ఉత్తమ్ యూ ట్యాక్స్ వసూల్ చేస్తున్నాడని, సివిల్ సప్లై శాఖలో వందల కోట్ల అవినీతి చేశారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇక ఈ వ్యాఖ్యలపై స్పందించడం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అదే రేంజ్‌లో మహేశ్వర్ రెడ్డికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు.ఇవాళ మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని.. ఊరుకునేదే లేదని హెచ్చరించాడు.దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు తాజాగా మహేశ్వర్ రెడ్డి మరోసారి కౌంటర్ ఇచ్చారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తవేనని అన్నారు.పౌర సరఫరాల శాఖలో అవకతవకలు జరిగాయని మరోసారి ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ రూ.100ల కోట్ల స్కామ్ జరిగింది వాస్తవమని మరోసారి ఆయన నొక్కి చెప్పారు. తాను అడిగిన 19 ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానాలు దాటవేశారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news