Telangana : ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

-

వరంగల్,నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుండగా …ఇప్పటికే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకుంది.3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోరులో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.ఇందులో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల మధ్యే తీవ్ర పోటీ ఉంది.

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 4, 63 ,839 మంది పట్టభద్రులు ఓటర్లు తమ ఓట హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్లలో.. 1,75 ,645 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 2,88,089 మంది పురుషులు,5 ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.పోలింగ్ రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది.జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది… జెంబో బ్యాలెట్ కావడంతో లెక్కింపుకు కనీసం 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news