వర్క్ ఫ్రమ్ హోమ్ తో విసుగెత్తిన వారికి ఉత్తరాఖండ్ టూరిజం బంపర్ ఆఫర్..

-

టూరిజం ప్రధాన ఆర్థిక వనరుగా గల ఉత్తరాఖండ్ రాష్ట్రం పర్యాటకులకి మంచి మంచి ప్యాకేజీలని అందిస్తోంది. కరోనా కారణంగా ఎంతో నష్టపోయిన పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడానికి టూరిజం నియమ నిబంధనలని సడలించిన ఉత్తరాఖండ్, తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ తో విసుగెత్తిపోయిన వారికి వర్కేషన్ పేరుతో సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. వర్క్ ప్లస్ లోకేషన్ ని మిక్స్ చేసి వర్కేషన్ ప్రోగ్రామ్ తో ముందుకు వచ్చారు. దీని ప్రకారం ఉత్తరాఖండ్ పర్యాటనకి వచ్చినవారికి పనిచేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటి వరకూ నాలుగు గోడల మధ్య వర్క్ చేసి, అలసిపోయిన వారికి కొండల్లో పనిచేసుకునే అవకాశం ఇస్తుంది.

పనిచేసుకునే వారికి కావాల్సిన ఇంటర్నెట్ తో పాటు సౌకర్యం, మెడికల్ సౌకర్యాలన్నింటినీ సమకూరుస్తుంది. అందమైన రిసార్టుల్లో హాయిగా కూర్చుని పనిచేసుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు చుట్టుపక్కల కొందల్లో విహరించి రావచ్చు. మొత్తానికి అటు ప్రకృతిని అనుభవిస్తూనే ఇటు పనిలో నిమగ్నం అవ్వొచ్చన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news