ఉత్తరప్రదేశ్ లో రోజు రోజుకి ఇబ్బందిగా మారుతున్న గ్యాంగ్ స్టర్లపై ఆ రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. కాన్పూర్ లో వికాస్ దూబే మారణకాండ తర్వాత ఆదిత్యనాథ్ సర్కార్ ఆగ్రహంగా ఉంది. ఆ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలోని దిల్‌బార్ కాలనీలో గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీ అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు లక్నో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.
అంతే కాదు… సదరు గ్యాంగ్ స్టర్ ఇల్లు కూల్చివేతకు గానూ జేసీబీల నిర్వహణ అయిన ఖర్చుని కూడా అతని నుంచి వసూలు చేయాలనీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జులై నెలలో యూపీ పోలీసులు అన్సారీతో పాటుగా అతని నలుగురు అనుచరుల తుపాకుల లైసెన్సులను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎవరు అయినా గ్యాంగ్ స్టర్ లు వసూళ్ళకు పాల్పడినా నేరాలు చేసినా కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.