దళితులు…ధనికులు కావాలనే సీఎం కేసీఆర్ ఆలోచనను బాగుందని..సీఎం కేసీఆర్ ఏడేళ్ల తరువాత మొట్టమొదటి సారి అంబెడ్కర్ ఫొటోకు పూలమాల వేయడం చూస్తున్నానని తెలిపారు వి. హనుమంత రావు. రాష్ట్రంలో ఉన్న దళితులందరి పది లక్షల ఇస్తేనే కేసీఆర్ దళిత బాందవుడు అవుతాడని చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వమే పంజాగుట్టలో అంబెడ్కర్ విగ్రహం తీసి దళిత , బహుజనులు ద్రోహం చేసింది.
అంబేడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం లాకప్ లో పెట్టిందని.. ఎన్ని ఆందోళనను చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహాన్ని లాకప్ లో పెట్టి దళిత బంధు అంటే ఎవరు నమ్మరని.. కేవలం హుజురాబాద్ లో దళిత బంధు అమలు చేస్తే ఉప ఎన్నికల కోసమని భావిస్తారని చురకలు అంటించారు.
రాష్ట్రంలో ఉన్న దళితులందరికి దళితబందు అమలు చేస్తేనే కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉన్నట్టుగా భావిస్తామన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలకంటే ముందే లాకప్ లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే కేసీఆర్ ను దళితులు నమ్ముతారన్నారు. అంబేడ్కర్ విగ్రహం కోసం అన్ని పార్టీలు ఆందోళన చేయాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు వీహెచ్.