చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా మూలాలను గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో భారత్ నుంచి వచ్చిన మాంసం కంటైనర్లలో మూడింటిని నిలిపి వేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఒక ప్రైవేట్ సంస్థ రవానా చేసిన అయిదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఇందు లోని మాంస పదార్థాలను వారం తరువాత నాశనం చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లో కరోనా కేసులు భారీగా పెరగడంతో దిగుమతులను కంబోడియా తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ దిగుమతులకు అనుమితి ఇచ్చింది. ఈ క్రమంలో ఇవాళ ఇండియా నుంచి వచ్చిన గేదె మాంసం కంటైనర్లలో కరోనా వైరస్ మూలాలను గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.