కరోనా రెండవ వేవ్ లో పిల్లల్లో మానసిక ఇబ్బందులు..!

-

కరోనా వైరస్ కారణంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. కేవలం పెద్దలు మాత్రమే కాదు పిల్లల్లో కూడా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. శారీరక సమస్యలు మొదలు మానసిక సమస్యల వరకూ పిల్లల్లో మనం చూడొచ్చు అని సైకాలజిస్టులు అంటున్నారు.

మానసిక సమస్యలు పిల్లల్లో సెకండ్ వేవ్ లో ఎక్కువగా చూసినట్లు మానసిక నిపుణులు చెప్పడం జరిగింది. అయితే పిల్లల్లో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది మానసిక నిపుణులు చెప్పడం జరిగింది. అయితే కారోనా సెకండ్ వేవ్ సమయంలో సోషల్ ఇంటరాక్షన్ సరిగ్గా లేదు.

ముఖ్యంగా తల్లిదండ్రులకు మరియు పిల్లలకి మధ్య కూడా ఎక్కువ ఇంటరాక్షన్ జరగలేదు. తల్లిదండ్రులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడం, పిల్లలు వాళ్ళ పనిలో ఉండడం వలన చాలా తక్కువ మాటలు ఉండేవి. దీని కారణంగా వాళ్ళల్లో కొన్ని మానసిక సమస్యలు వచ్చినట్లు గుర్తించారు.

రెండేళ్ల నుంచి మూడేళ్ల వయసులో ఉండే పిల్లలు మాట్లాడటం మొదలు పెడతారు. కానీ మాటలు పిల్లల్లో ఇంకా రాలేదని ఆలస్యంగా వస్తున్నాయి అని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా పిల్లలు చేసే కొన్ని యాక్టివిటీస్ లో కూడా రాలేడనై, ఆలస్యంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

పిల్లలు టాయిలెట్ ట్రైనింగ్ వంటి వాటిలో కూడా ఆలస్యంగా వున్నారని గుర్తించారు. ఈ పాటికే టాయిలెట్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాల్సిన చిన్నారులు ఇంకా పక్క తడుపుతున్నట్టు మానసిక నిపుణులు గుర్తించడం జరిగింది. అదే విధంగా తెలియని వ్యక్తులని చూస్తే ఎంగ్జైటీ, సోషల్ ఫోబియా లాంటివి ఉన్నాయని చెప్తున్నారు.

ఎవరైతే ట్రీట్మెంట్ కోసం మానసిక నిపుణుల వద్దకు వెళ్తున్నారో వాళ్ళలో ఎక్కువ భయం ఉన్నట్లు గుర్తించారు ఎక్కువగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సమస్యలు వచ్చాయి అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news