దేశవ్యాప్తంగా ఈరోజు నుండి 15 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారికి వ్యాక్సిన్ లు ఇస్తున్నారు. పెద్దలకు ఇస్తున్నట్లుగా నే వీరికి కూడా 0.5 మిల్లీ లీటర్ల మోతాదులో వ్యాక్సిన్ వేస్తారు. ఫస్ట్ డోస్ వేసుకున్న నెల రోజులకు సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేస్తారు. ఇప్పటికే వ్యాక్సిన్ ల పంపిణీకి అవసరం అయిన ఏర్పాట్లు పూర్తయినట్టు తెలంగాణ వైద్యారోగ్యశాక డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంటాయని చెప్పినప్పటికీ ధర ఎంత అనేది చెప్పలేదు.
ఇక హైదరబాద్ లోని 12 మునిసిపల్ కార్పొేషన్లలో ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకున్న లబ్ది దారులకు మాత్రమే టీకాలు ఇస్తుండగా జిల్లాల్లో ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన వారికి వ్యాక్సిన్ లు ఇవ్వనున్నారు. రాష్ట్రం లో మొత్తం 22 లక్షల మందికి పైగా టీనేజర్లు ఉన్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అరగంట పాటు వ్యాక్సిన్ కేంద్రం వద్దే ఉండాలి ఆలోపు ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నట్లయితే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 10 నుండి రాష్ట్రంలో దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడేవారికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వృద్దులకు మూడో డోస్ వేయనున్నారు.