బంగారంతో చేసిన వడాపావ్.. ధర ఎంతంటే..?

సాధారణంగా మనం వడాపావ్ ని తయారు చేసుకుంటూ ఉంటాం. ఎంతో రుచిగా చక్కటి మసాలా ఫ్లేవర్స్ తో నూరు ఊరిస్తుంది. అయితే సాదాసీదా వడాపావ్ ని చూసి ఉంటారు కానీ ఈ వడాపావ్ ని మీరు ఇంత వరకు చూసి ఉండరు. ఇది ఇలా ఉంటే ముంబై లో వడాపావ్ ఎంత ఫేమస్ ఓ మనకి తెలుసు. అయితే ఈ పాపులర్ డిష్ ని ఇప్పుడు దుబాయ్ లో మొదలు పెట్టారు.

vadapav
vadapav

పైగా ఈ వడాపావ్ ని సాదా సీదాగా చేయడం లేదు. ఏకంగా బంగారంతో తయారు చేస్తున్నారు. దుబాయ్ మొట్టమొదట 22 క్యారెట్ గోల్డ్ వడాపావ్ ని మొదలు పెట్టింది దీని ధర సుమారు రెండు వేల రూపాయలు. ట్విట్టర్ లో మసరత్ దౌడ్ ఈ వడాపావ్ ని షేర్ చేయడం జరిగింది. నిజంగా ఈ వడాపావ్ అందరి మనసుల్ని దోచుకుంది.

ఈ వీడియోని 20 వేల మందికి పైగా చూశారు. అయితే ఈ వడాపావ్ ని మామూలుగా మనం ప్లేట్ లో సర్వ్ చేసుకున్నట్లు చేయరు. చిన్న చెక్క డబ్బాలో పెట్టి ఇస్తారు. ఈ వడాపావ్ తో పాటు స్వీట్ పొటాటో ఫ్రైస్ మరియు పుదీనా లేమనేడ్ ని ఇస్తారు. ఈ వడాపావ్ మొత్తం ఛీజ్ తో ఫిల్ చేస్తారు అలాగే  హోం మేడ్ మింట్ మాయనీజ్ డిప్ చేస్తారు. మంచి క్వాలిటీ తో దీనిని వ్రాప్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్రెంచ్ నుండి ఇంపోర్ట్ చేసిన 22 క్యారెట్ గోల్డ్ లీవ్స్ తో ఎంతో అద్భుతంగా దీనిని తయారు చేస్తారు. గతంలో దుబాయ్ రాయల్ గోల్డ్ బిర్యానీని తీసుకువచ్చింది దాని ధర రూ.19000 పైనే. ఇప్పుడు వడాపావ్ ని తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.