వామిక ఫోటో రివీల్ పై స్పందించిన అనుష్క

-

విరాట్ కోహ్లీ, అనుష్కల ముద్దుల తనయ వామిక ఫోటో రివీల్ కావడం నెట్టింట్లో తెగ వైరల్ కావడం చకచక జరిగిపోయాయి. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే సమయంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ తరువాత అనుష్కను చూస్తూ కొన్ని సంకేతాలు చేశాడు. అయితే ఆ సమయంలో స్టాండ్స్ లో ఉన్న అనుష్క, వామికాలపైకి కెమెరాలు ఫోకస్ చేశాయి. ఆ సమయంలో అనుష్క, వామికాను ఎత్తుకుని ఉంది. ఈ ఫోటోలు కెమెరాలో క్యాప్చర్ అయ్యాయి. తొలిసారిగా వామికా ఫోటోలు రివీల్ కావడంతో.. ఒక్కసారిగా ఫోటోలు వైరల్ అయ్యాయి.

తాజాగా వామిక ఫోటో రివీల్ పై అనుష్క స్పందించింది.  మా కుమార్తె ఫోటోలు వామికా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని తెలసింది. అయితే ఆ సమయంలో కెమెరాలు మా వైపు ఉన్నాయని తెలియదు. వామిక గోప్యతపై మొదటి నుంచి మేం అనుకున్నట్లే మా నిర్ణయం ఉంటుందని అనుష్క అన్నారు. మా అభ్యర్థనతో కొన్ని వెబ్ సైట్లు ఫోటోలను డిలిట్ చేశాయని.. వారందరికీ థాంక్స్ అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news