ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలి – బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న 44 వేల టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్‌ చేశారు. టీచర్ పోస్టులను భర్తీ చేయకపోవడంవల్ల నిర్వీర్యమైన విద్యా వ్యవస్థ ఉందని నిప్పులు చెరిగారు. విద్యా రంగంలో 18వ స్థానం లో తెలంగాణ ఉండటమే దీనికి నిదర్శనమని ఫైర్‌ అయ్యారు బండి సంజయ్ కుమార్.

బీఈడీ, డీఈడీ, పండిట్ శిక్షణ, పీఈటీ పూర్తి చేసి టీచర్ పోస్టుల కోసం 7 లక్షల మంది నిరుద్యోగులు నిరాశలో ఉన్నారన్నారు బండి సంజయ్ కుమార్. టీచర్లు లేక విద్యార్థులకు పాఠాలు చెప్పే నాథుడే కరువయ్యారని.. గత ఐదేళ్లుగా టెట్ నిర్వహించకపోవడంతో నిరాశలో యువత ఉందని మండిపడ్డారు బండి సంజయ్ కుమార్. మైనారిటీ, ఎయిడెడ్ సంస్థల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యారంగంలో 18వ స్థానంలో తెలంగాణ ఉండటమే నిదర్శనమని.. యుద్ద ప్రాతిపదికన ఖాళీ పోస్టులను భర్తీ చేసి విద్యారంగాన్ని రక్షించాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news