తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ గా ఉన్న వంటెరు ప్రతాప రెడ్డి పదవీ కాలం ముగియడం తో మరో రెండు సంవత్సరాలు పదవీ కాలాన్ని పొడగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమశ్ కుమార్ జారీ చేశారు. దీంతో టీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప రెడ్డి మరో రెండు సంవత్సరాలు ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చైర్మెన్ గా వ్యవహరించనున్నారు.
కాగ వంటేరు ప్రతాప రెడ్డి 2019 లో అధికార పార్టీ లో చేరారు. దీంతో 2019 అక్టోబర్ నెలలో రాష్ట్ర అటవి అభివృద్ధి సంస్థ కు చైర్మెన్ అయ్యారు. రెండు సంవత్సరాల పాటు చైర్మెన్ గా ఉన్నాడు. అయితే ఇటీవల ఆయన పదవీ కాలం ముగియడం తో తాజా గా రాష్ట్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తు నిర్ణయం తీసుకుంది. కాగ వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్ఎస్ లో చేరక ముందు సీఎం కేసీఆర్ నియోజక వర్గం లో ఎమ్మెల్యే గా పోటీ చేసి కేసీఆర్ చేతి లో స్వల్ప తేడా తో ఓడిపోయారు. కానీ చివరికి టీఆర్ఎస్ లోనే చేరారు.