రేపటి నుంచి వైయస్ షర్మిల… “రైతు ఆవేదన యాత్ర”

వైఎస్ ష‌ర్మిల‌… ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి.. సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేస్తూన్నారు. ఇప్ప‌టికే.. చాలా ర‌కాల ఆందోళ‌న‌లు చేశారు వైఎస్ ష‌ర్మిల‌. ఇక తాజాగా మ‌రో పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు వైఎస్ ష‌ర్మిల‌. రేపటి నుంచి వైయస్ షర్మిల… రైతు ఆవేదన యాత్రను ప్రారంభించ‌నున్నారు. రైతు ఆవేదన యాత్ర రేపు (ఆదివారం) నుంచి చాలా అట్ట హాసంగా ప్రారంభం కానుంది.

రైతు ఆవేదన యాత్ర మొదటి రోజు వివరాలు:

రేపు ఉదయం సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం, జోగిపేట్ మండలంలోని రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల గారు పరామర్శిస్తారు. అక్కడి మెదక్ జిల్లా నర్సాపుర్ నియోజకవర్గం, కౌడిపల్లి మండలం, కంచనపల్లికి వెళ్తారు. కంచనపల్లిలోని ఇద్దరు రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఆ తర్వాత కౌడిపల్లి మండలం, లింగంపల్లి గ్రామంలో మరొక రైతు కుటుంబాన్ని వైయస్ షర్మిల గారు కలిసి వారికి ధైర్యం చెప్పనున్నారు.