జ్ఞాన్వాపి మసీదుకు పూర్వం పెద్ద హిందూ దేవాలయం ఉందని పురావస్తు శాఖ నివేదిక సూచిస్తోందని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపిన సంగతి తెలిసిందే.అయితే వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు బయటపడినట్లు సమాచారం. జ్ఞానవాపి ఒకప్పుడు హిందూ దేవాలయమన్న వాదనల మేరకు కోర్టు అనుమతితో ఏఎస్ఐ మసీదులో అధ్యయనం చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఈ విగ్రహాలు వెలుగుచూసినట్లు తెలుస్తోంది. ఇవి సుమారు క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యకాలానికి చెందినవి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే…జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని ఆలయంలో పూజలు చేసుకునేందుకు స్థానిక కోర్టు అనుమతివ్వడంపై హిందూ పక్ష న్యాయవాది విష్ణు శంకర్ జైన్ స్పందించారు. ఏడు రోజుల్లోనే పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందని.. ప్రతి ఒక్కరికీ పూజ చేసుకునేందుకు హక్కు ఉందని చెప్పారు. ఒకవేళ అవసరమైతే పైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమన్నారు.