విజయసాయిపై వర్ల రామయ్య ఫైర్.. అవినీతి ఘనాపాఠీ అంటూ విమర్శనాస్త్రాలు

-

మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పులిలా వ్యవహరిస్తూ, ఢిల్లీలో పిల్లిలా మారే విజయసాయి అవినీతి చరిత్ర అందరికీ తెలిసిందేనని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. అవినీతి ఘనాపాఠీ విజయసాయి చంద్రబాబు గురించి మాట్లాడటం తప్పు అని విమర్శించారు. అదాని డిస్టలరీస్ తో సంబంధం లేదని చెప్పే ధైర్యముందా? అని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడారు.

Suspect govt involvement in Guntur stampede deaths: Varla Ramaiah

“ఏ2 విజయసాయిరెడ్డి గురివింద గింజ లాంటివాడు. విజయసాయి చరిత్ర అంతా అవినీతిమయం. ఏ1 అంటే జగన్మోహన్ రెడ్డి, ఏ2 అంటే విజయసాయిరెడ్డి అని రాష్ట్రంలోని అందరికీ అర్థమైపోతుంది. సీబీఐ 11 కేసుల్లో విజయసాయిపై చార్జిషీట్ వేసింది. అదృష్టం కలిసొచ్చి కోట్లకు పడగలెత్తావు, ఆ కోట్లతో తిని, తాగి తందానాలాడాలిగానీ.. ఏ తప్పు చేయని, అవినీతి వైపు కన్నెత్తి చూడని చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలడం కరెక్టు కాదు.

అదృష్టం కలిసి రావడంతో ఎంపీ అయినంతమాత్రాన ఇలాంటి వ్యవహారశైలా? నీకు ఎలా వచ్చాయి కోట్లు? బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శిస్తూ మధ్యలో చంద్రబాబును లాగడమెందుకు? బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై ట్వీట్ చేస్తూ మధ్యలో చంద్రబాబును తీసుకురావడమేంటి? ఢిల్లీలో బీజేపీ వారివద్ద బక్కచిక్కిన పిల్లిలా వ్యవహరిస్తావు, వంగి వంగి దండాలు పెడతావు, నీ బాంచన్ దొర కాల్మొక్తా అంటావు… రాష్ట్రానికొచ్చి బీజేపీ పట్ల పులిలా మాట్లాడుతావు. ధైర్యముంటే బీజేపీతో, మోదీతో, అమిత్ షాతో ఛాలెంజ్ చేయాలి.’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news