జూ.ఎన్టీఆర్ పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు.. అల్లుడిగా విఫలమయ్యాడు !

అమరావతి : చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యుల వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిరసన చేపట్టారు. 12 గంటల పాటు భార్యతో కలిసి తన నివాసంలో నిరసన చేపట్టారు వర్ల రామయ్య. వర్ల నిరసనకు సంఘీభావం తెలిపారు టీడీపీ నేతలు గద్దె, బుద్దా. అయితే.. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వర్ల రామయ్య.

భువనేశ్వరిపై కొడాలి, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీఆర్‌ స్పందించిన తీరు సరిగా లేదని చురకులు అంటించారు. ఈ విషయాన్ని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా అని ఫైర్‌ అయ్యారు. భువనేశ్వరి అల్లుడిగా ఎన్టీఆర్‌ విఫలమయ్యాడని ఫైర్‌ అయ్యారు.  ఈ ఘటన పై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఘాటు గా స్పందించి ఉంటే.. బాగుండేదని పేర్కొన్నారు. బూతుల మంత్రి కొడాలి నానికి ఎన్టీఆర్‌ అంటే భయమని.. ఆయనను ఎన్టీఆర్‌ కంట్రోల్‌ చేయాల్సిన అవసరముం దని పేర్కొన్నారు.