ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ బాబాయి మాజీ మంత్రి వివేకా హత్య పెను దుమారం రేపింది. హత్య ఎవరు చేశారు అనే అంశం పై ఇప్పటికీ సరైన నివేదిక ఎవ్వరూ ఇవ్వలేదు. సాక్షాత్తు జగన్ ఆనాటి గవర్నర్ ను కలిసి ఆ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. ఇక అదే అంశాన్ని గుర్తు చేస్తూ ఏపీ ప్రభుత్వం పై సెటైర్లు వేశారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వంటి చిల్లర కేసులకు ఇచ్చిన ప్రాధాన్యత వివేకా హత్య కేసుకు ఇవ్వడంలేదని విమర్శించారు. శవాన్ని ఇంట్లో పెట్టుకొని రాజకీయాలు చేసింది మీరు కాదా అని ఆయన జగన్ ను నిలదీశారు. గవర్నర్ ను కలిసి సీబీఐ విచారణకు ఇవ్వాలని కోరలేదా అని ప్రశ్నించారు. మరలా ముఖ్యమంత్రి అవ్వగానే పిటిషన్ ను వెనక్కి తీసుకోగల కారణాలను చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ప్రధానికి, కేంద్ర హోంమంత్రికి లేఖ రాయాలని స్పష్టం చేశారు. ఈ కేసును సీబీఐ కు ఇచ్చి ఇప్పటికే 100 రోజులు అవుతున్నా ఎటువంటి సమాదానం తెలపడం లేదు ఎందుయికని ఆయన ప్రశ్నించారు. శోషల్ మీడియా లో మీకు విరుద్ధంగా పోస్టులు చేస్తేనే కేసులు మోపి అరెస్టులు చేయిస్తున్నారని అదే నిబద్ధత వివేకా కేసు పై ఉండుంటే ఎప్పుడో కేసు ఈపాటికే తేలిపోయేదని ఆయన విమర్శించారు.
వివేకా మృతదేహంతో శవ రాజకీయాలు చేశావు..! ఇప్పుడు నోరు మెదపడం లేదేంటి..? వర్ల..!
-