కరోనా వైరస్ కారణంగా గత రెండున్నర నెలలుగా సినీ ఇండస్ట్రీలో, టీవీ రంగంలో ఎలాంటి షూటింగ్ లు జరగలేదు. అయితే లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో ఈ మధ్యనే షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. దీంతో తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కలకలం మొదలైంది. ఇటీవలే ఓ తెలుగు సీరియల్ నటుడు ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ షూటింగ్ నిలిచిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ యాంకర్, దర్శకుడు ఓంకార్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.
ఇటీవల ఇస్మార్ట్ జోడి షోకు సంబంధించిన షూటింగ్లో పాల్గొన్న ఓంకార్.. ఈ విషయం తెలీకుండానే షూటింగ్ లో పాల్గొన్నాడట. అయితే విషయం తెలిసాక షూటింగ్ రావడం లేదని.. షో నిర్వాహకులు ఆరా తీస్తే.. ఓంకార్ కు కరోనా పాజిటివ్ అన్న విషయం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. దీనికి సంబందించి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ షో షూటింగ్ లో పాల్గొన్న మిగతా సభ్యులు కూడా కరోనా టెన్షన్ పట్టుకున్నట్టు సమాచారం. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన బండ్ల గణేష్ ఈ మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీకి కరోనా భయం పట్టుకుంది.