అతనో కామాంధుడు మానవ మృగం ఓ యువతి పై కన్నెశాడు ఆ యువతిని బెదిరించాడు, ఆ యువతిపై తన కామ దాహాన్ని తీర్చుకున్నాడు. ఒక్కసారి రెండు సార్లు అనే లెక్క లేకుండా ఆ యువతి పై అత్యాచారం చేస్తూనే ఉన్నాడు.. యువతిని బెదిరించి తన స్నేహితులతో కూడా లైంగిక దాడులు చేయించాడు. ఈ అఘాయిత్యాన్ని తట్టుకోలేక మనస్తాపం చెంది బాధితురాలు బావిలో దుకేసింది. మరో మూడు రోజులకే బాధితురాలి తండ్రి కూడా శవంగా మారి కనిపించాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని అళ్వార్ జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని అళ్వార్ జిల్లాలో అనీస్ అనే ఓ కామాంధుడు నివాసం ఉంటున్నాడు. సమీపంలో ఉండే ఓ యువతి పై కన్నెశాడు తనని లొంగదీసుకొని అత్యాచారం చేశాడు. మానసికంగా హింసించాడు. కామదాహం తీరక తరచూ ఆ యువతి పై అత్యాచారాలు చేయసాగాడు. యువతిపై దాడి చేసి తన స్నేహితులతో బలవంతం చేయించాడు. లైంగిక దాడులు మానసిక వేదన తట్టుకోలేక ఆ యువతి మనస్తాపం చెందింది చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. దగ్గరలోని బావిలో దుకేసింది.. ఇది గమనించిన స్థానికులు బావిలోకి దిగి ఆ యువతిని రక్షించారు. బాధితురాలి క్షోభ తెలియగానే తండ్రి తీవ్ర మంస్తాపం చెందాడు. సరిగ్గా మూడు రోజుల తరువాతా పొలం లోని చెట్టుకు ఉరి వేసుకొని శవంగా కనిపించాడు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులకు అనీస్ యువతి పై అత్యాచారామే కాకుండా తండ్రి విషయం లోనూ జోక్యం చేసుకున్నట్టు తండ్రిని కూడా అనీసే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.