హీరో వరుణ్ సందేశ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తండ్రి అంటే తాత గారు అయిన జీడిగుంట రామచంద్రమూర్తి కరోనా కారణంగా కన్ను మూశారు. ఆయన వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచన… ఇలా అన్నింట్లో తన సత్తా చాటారు జీడిగుంట రామచంద్రమూర్తి.
కేవలం రచనపై ఉన్న ఆసక్తితోనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని మరీ ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు అందులోనే ఉండిపోయారాయన. 80 ఏళ్ల వయసులోనూ కథలు రాస్తూ ఆనందంగా జీవనం సాగిస్తున్నారు ఆయన. ఆయనకు ముగ్గురు కొడుకులు. ఇద్దరు కొడుకులు అంటే వరుణ్ తేజ్ తండ్రితో సహా అమెరికాలో ఉంటారు. ఇక మూడో ఆయన ‘జీడిగుంట శ్రీధర్’ టీవీ సీరియళ్లతో తెలుగు ఇండస్ట్రీకీ సుపరిచితుడే. ఇక వరుణ్‌సందేశ్ ఆయన పెద్దబ్బాయి కొడుకు.