దుబ్బాక బై పోల్ లో రఘునందన్ గెలుపు.. ప్రకటించిన ఈసీ

హోరాహోరీగా సాగిన దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించిందని సమాచారం అందుతోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారని అంటున్నారు. ఆయన 1470 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందాడని సమాచారం అందుతోంది. అయితే ఈ విషయం మీద ఎన్నికల సంఘం ధ్రువీకరించాల్సి ఉంది. మొదటి నుంచి ఆధిక్యతను కనబరుస్తూ వచ్చిన బీజేపీ ఆ తర్వాత టిఆర్ఎస్ దెబ్బకి కాస్త వెనకబడిందని చెప్పాలి.

అయితే బిజెపి అభ్యర్థి కంటే టిఆర్ఎస్ అభ్యర్థి క్రమంగా ఓట్ల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో ట్రెండ్స్ మారినట్లు భావించారు. అయితే అదేమీ నిజం కాదని రఘునందన్ రావు గెలిచాడని ఇప్పుడు సమాచారం అందుతోంది. ఇక ఆయన ప్రస్తుతం 1470 ఓట్లతో గెలుపొందాడని సమాచారం. అయితే ఈసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వీవీ ప్యాట్ లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లెక్కించాల్సి ఉంటుంది ఈసీ మార్గదర్శకాల ప్రకారం. దీంతో అధికారిక ప్రకటన కోసం మరికొంత సమయం పట్టేటట్లు కనబడుతోంది.