Varun tej : “గని” నుంచి ఫస్ట్ పంచ్

-

గద్దల కొండ గణేష్ సినిమా మూవీతో మంచి విజయం సాధించాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఆ సినిమా తర్వాత… గని మూవీలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి లాంటి ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు నటిస్తుండడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లకు మంచి ఆదరణ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఇందులో వరుణ్ తేజ్… బాక్సర్ గెటప్ లో అందరినీ అలరించాడు. రక్తం తో ఉన్న ఓ సీన్ ను ఈ గ్లిం ప్స్ లో చూపించారు. అలాగే.. ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఇక తాజాగా విడుదల అయిన అప్డేట్ తో గని సినిమాపై అందరికీ అంచనాలు పెరిగిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version