వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధా ఉండదు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం మంచిది. అలానే వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కుటుంబ సమస్యలకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.
కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు ఏమీ కలగకుండా ఉండాలంటే పండితులు చెప్పినట్లుగా అనుసరించాలి. ఇలా చేస్తే కుటుంబ సభ్యులు మధ్య గొడవలు ఉండవు మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఇలా అనుసరించాలి అని వాస్తు పండితులు అంటున్నారు. ఆనందం కలగాలన్నా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రాకుండా ఉండాలన్నా ఇలా చేయండి.
నెగిటివ్ ఎనర్జీ తొలగి పోవడానికి ఉప్పుని ఉపయోగించండి. ఉప్పుని మీరు ఉండే ఇంట్లో ఒక మూలన ఉంచడం వలన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే కర్పూరాన్ని ఇంట్లో వెలిగించడం వలన కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
పటికని కూడా మీరు ఇంట్లో ఉంచొచ్చు. ఇది కూడా పాజిటివ్ ఎనర్జీని కలిగించి నెగటివ్ ఎనర్జీ ని దూరం చేస్తుంది. మామూలుగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలని అనుసరించాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మానసిక ప్రశాంతతను పొందేందుకు కూడా ఈ వాస్తు చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.