వాస్తు: భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఈ టిప్స్ ని పాటించండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతాయి. అయితే మన ఇంట్లో చాలా రకాల దేవుడు ఫోటోలను మనం పెడుతూ ఉంటాము. అయితే నిజానికి ఇంట్లో దేవుడి ఫోటోలు పెట్టడం వల్ల చాలా మంచి కలుగుతుంది. అయితే వాస్తు ప్రకారం అనుసరించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాధా కృష్ణుడు ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి కలుగుతుందని పండితులు అంటున్నారు. అయితే రాధా కృష్ణుడు ఫోటోలను పెట్టినప్పుడు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ ద్వారం దగ్గర ఈ ఫోటోని పెట్టొద్దు. చాలా మంది ఇంటి ముఖ ద్వారం దగ్గర దేవుడు ఫోటోలను పెడతారు. కానీ రాధాకృష్ణుల ఫోటోని ముఖద్వారం దగ్గర పెట్టకూడదు. అయితే రాధాకృష్ణుడు ఫోటోని మీ బెడ్ రూమ్ లో పెడితే చాలా మంచిది. ఎందుకంటే రాధా కృష్ణులు ప్రేమకి చిహ్నం. ఒకవేళ కనుక భార్య భర్తలు ఈ ఫోటోని బెడ్ రూమ్ లో పెడితే వాళ్ళ బంధం కూడా తియ్యగా ఉంటుంది. అలానే మీ రిలేషన్ షిప్ ఎంతో బాగుంటుంది.

ఎప్పుడైనా సరే రాధా కృష్ణుడి ఫోటోలు పెట్టినప్పుడు తూర్పు వైపు ఉండేటట్లు చూసుకోండి. అలాగే మహిళలు ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటే వాళ్ళు కచ్చితంగా కృష్ణుడు ఫోటోలు ఇంట్లో పెట్టుకోండి. కృష్ణుడు ఫోటో ని బెడ్ రూమ్ లో పెట్టుకుంటే చాలా మంచిది. అయితే బెడ్ రూమ్ లో ఫోటోలు పెట్టినప్పుడు దానిని పూజించకూడదు. అలా పూజించడం మంచిది కాదు. ఒకవేళ మీరు ఆ ఫోటోని పూజించారు అంటే బెడ్రూంలో పూజించకూడదు. ఇలా ఈ ప్రకారం మీరు అనుసరిస్తే భార్యాభర్తల మధ్య ఇబ్బందులను కూడా తొలగిపోతాయి. అలాగే వారు ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news