ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేవలం కేసుల సంఖ్య వెయ్యికి లోపే నమోదవుతున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో కేసుల సంఖ్య ఒకానొక దశలో పదివేలను కూడా దాటింది. థర్డ్ వేవ్ ప్రభావంతో… ఏపీలో ఎక్కువగా కేసులు నమోదయ్యాయి ఆసమయంలో. అయితే ఇప్పుడు దాదాపుగా థర్డ్ వేవ్ అంతం అయిపోయింది. దీంతో కేసుల సంఖ్య దిగి వస్తోంది. మరోవైపు ఇండియాలో కేసుల సంఖ్య లక్షకు దిగువగానే నమోదవుతున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 675 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కరోనాతో బాధపడుతూ మరణించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 2414 మంది కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,808 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను కూడా ఎత్తేసింది. మాస్క్ సంబంధించి మాత్రమే చర్యలు తీసుకుంటుంది. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 28 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. రానున్న రోజుల్లో మరింతగా ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.