ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో ఆర్థిక సమస్య కూడా ఒకటి. చాలా మంది ఆర్థిక సమస్యల వలన ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే కచ్చితంగా ఇలా చేయండి. ఈరోజు వాస్తు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా ఆచరిస్తే ఏ బాధ ఉండదు అలానే డబ్బులు కూడా నిలుస్తాయి.
ఇంట్లో డబ్బులు నిలవాలన్న ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలన్నా కచ్చితంగా వీటిని పాటించండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్పూరాన్ని ఇంట్లో వెలిగిస్తే ఆర్థిక బాధల నుండి బయటపడొచ్చు పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కాబట్టి పూజ గదిలో ఉదయం సాయంత్రం కూడా కర్పూరమును వెలిగించండి. అదేవిధంగా లక్ష్మీ స్తోత్రాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ ఇంట్లో చదివితే ఆర్థిక బాధలు ఉండవు. ఇంట్లో డబ్బు నిలుస్తుంది ఖర్చులు ఎక్కువగా ఉండవు. కనుక ఆర్థిక బాధలతో బాధపడే వాళ్ళు ఈ చిట్కాని కూడా ఉపయోగించవచ్చు.
అలానే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇంటి బయట కూడా శుభ్రంగా ఉండాలి. ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటేనే అదృష్టం వస్తుంది లేకపోతే లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పూజ చేసిన తర్వాత ప్రతిరోజు గంగాజలాన్ని ఇంటిముందు జల్లితే చాలా మంచిది. ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలను. మరి వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఉండండి.