వాస్తుకు సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలను పండితులు చెప్పడం జరిగింది. అయితే మరి వాస్తు శాస్త్రం ప్రకారం సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం. చాలా మంది ఇళ్లల్లో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కుటుంబం మధ్య గొడవలు రావడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం ఇలా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.
అయితే ఏ సమస్యనైనా వాస్తుతో మనం పరిష్కరించుకోవచ్చని పండితులు చెప్తున్నారు. మరి ఆలస్యమెందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలు గురించి మనం తెలుసుకుందాం. పండితులు ఈరోజు ఆగ్నేయం గురించి చెప్తున్నారు. ఆగ్నేయం వైపు ఉండే గోడకి ఈ తప్పులు చేయొద్దు అని అంటున్నారు.
ఈశాన్యం కుటుంబానికి కష్టాలు సమస్యలు తీసుకు వస్తుంది. కాబట్టి ఈశాన్యం వైపు కచ్చితంగా వాస్తుని పాటించాలి. ఈశాన్యం వైపు ఉండే గోడ కి పసుపు రంగు అస్సలు వేయకూడదని… పసుపు రంగు పెయింట్ వేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. ఒకవేళ కనుక పసుపు రంగు వేస్తే ఇంటి యజమానికి కానీ తల్లికి కానీ కష్టాలు వస్తాయి అని తెలుస్తోంది.
అదే విధంగా తరచూ గొడవలు రావడం, అనారోగ్య సమస్యలు రావడం జరుగుతాయని అంటున్నారు. కాబట్టి ఆగ్నేయం వైపు పసుపు రంగు పెయింట్ వేయడం మంచిది కాదని తెలుసుకోండి. ఒకవేళ కనుక మీరు ఈ తప్పు చేసి ఉంటే ఈ తప్పును సరి చేసుకోండి లేదంటే ఇబ్బందులు ఎక్కువైపోయే అవకాశం వుంది.