వాస్తు: ఇలా చేస్తే వ్యాపారంలో ఇబ్బందులు వుండవు..!

వాస్తు శాస్త్రం ప్రకారం మీరు అనుసరిస్తే ఖచ్చితంగా సమస్యలు లేకుండా ఉండొచ్చు. వ్యాపారంలో మీరు సమస్యలను ఎదుర్కొంటున్నారా..?, ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది వస్తోందా..? అయితే తప్పకుండా మీరు ఈ వాస్తు చిట్కాల గురించి తెలుసుకోవాలి. నిజంగా వాస్తును పాటిస్తే సమస్యలు ఉండవు. ఈరోజు పండితులు వ్యాపారంలో నష్టం కలగకుండా, ఇబ్బంది రాకుండా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే ఈ చిట్కాలని పాటించమని చెబుతున్నారు. అయితే మరి ఇక వాటి కోసం ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేద్దాం.

మీ ఇంట్లో ఈశాన్యం వైపు తెలుపు రంగు పెయింట్ వేయించుకుంటే మంచి కలగదని.. కనుక ఈశాన్యం వైపు ఈ రంగు వుండకూడదు అని చెబుతున్నారు ఒకవేళ కనుక మీ ఇంట్లో ఈశాన్యం వైపు గోడ మీద తెలుపు రంగు ఉంటే దానిని మార్చుకోండి. ఈశాన్యం వైపు తెలుపు రంగు గోడ కనుక ఉంటే వ్యాపారంలో ఇబ్బందులు వస్తాయని గమనించండి.

అదే విధంగా ఇది తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది, అందుకనే ఎప్పుడూ కూడా ఈశాన్యం వైపు సిల్వర్, తెలుపు, గ్రే కలర్ వేసుకో వద్దు వీటి వల్ల ఇబ్బందులు వస్తాయి. అలానే వ్యాపారంలో కూడా చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి తెలుపు రంగుని ఈశాన్యం వైపు అస్సలు వేయొద్దు. ఇలా ఈ మార్పులు కనుక చేశారు అంటే కచ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా జీవించొచ్చు.