వాస్తు: ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ తప్పులు చెయ్యద్దు…!

-

మీ ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయా…?, అనారోగ్య సమస్యలు వస్తున్నాయా…? లేదా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయా..? అయితే వాస్తు శాస్త్రం ప్రకారం పండితులు కొన్ని టిప్స్ ని షేర్ చేసుకున్నారు. వీటిని కనుక మీరు అనుసరిస్తే తప్పకుండా మీ ఇంట్లో ఆనందం, శాంతి మరియు ధనం ఉంటాయి. మరి వాటి కోసం ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేయండి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రామాయణం, మహాభారతం, యుద్ధాలు లాంటి ఫోటోలని మీ ఇంట్లో ఉంచితే అప్పుడు గొడవలు ఎక్కువగా ఉంటాయని పండితులు అంటున్నారు. కాబట్టి అటువంటి వాటిని మీ ఇంట్లో పెట్టకండి. గొడవలు ఎక్కువగా ఉండే ఇళ్లల్లో ఇవి కనుక ఉంటే తొలగించడం మంచిది.

అదే విధంగా ఆగ్రహంతో ఉండే జంతువుల ఫోటోలుని కూడా పెట్టడం మంచిది కాదు. పులి సింహం లాంటి ఫోటోలని ఇంట్లో ఉంచడం వల్ల ఇబ్బందులు ఉంటాయని అటువంటి వాటిని ఇంట్లో ఉండడం వల్ల తరచు గొడవలు ఉంటాయి అని అంటున్నారు.

ఇది ఇలా ఉంటే చాలామంది ఇళ్లల్లో చెప్పులని, షూస్ ని మరియు బట్టలు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తూ ఉంటారు. అది ఇంటికి మంచిది కాదని పండితులు అంటున్నారు. ఈ విధంగా ఉండే ఇళ్లలో ధననష్టం ఉంటుందని ఆర్థిక సమస్యలు ఉంటాయని కెరియర్ కూడా హెచ్చుతగ్గులుగా ఉంటుందని పండితులు అంటున్నారు.

సరిగ్గా వెలగని లైట్లు, బల్బులు ఇంట్లో ఉండటం కూడా మంచిది కాదని పండితులు అంటున్నారు వీటి వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువై పోతుందని అటువంటివి ఉంచకూడదని చెప్తున్నారు. కాబట్టి ఈ తప్పును మీరు సరి చేసుకుంటే మీకు ఎటువంటి సమస్యలు ఉండకుండా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news