వాస్తు: ఆరోగ్యంగా, ఆనందంగా ఉండడానికి మీ ఇంటి ముఖద్వారం దగ్గర ఈ పనులు చేయండి…!

-

వాస్తు శాస్త్రం ప్రకారం పండితులకు కొన్ని విషయాలనిషేర్ చేశారు. వీటిని కనుక పాటించారు అంటే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి ఆనందం ఉంటుంది. పాజిటివిటీ రావడానికి కచ్చితంగా మీరు వీటిని అనుసరించండి దీనితో మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు.

ప్రతి రోజు శుభ్రంగా ఉంచుకోవడం: వాస్తు ప్రకారం ప్రతిరోజూ మీ ఇంటి ముఖద్వారం దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉండే మహిళ ఉదయం లేచిన వెంటనే ముఖ ద్వారం దగ్గర శుభ్రంగా ఉంచాలి.

స్నానం చేసిన తర్వాత ఈ పనులు చేయాలి: స్నానం చేసిన తర్వాత పూజ చేసి ముఖద్వారం దగ్గర పసుపు నీళ్లు జల్లాలి. అదేవిధంగా తలుపుకు ముందు కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రంగా తుడవాలి.

స్వస్తిక్: ఇంటి తలుపుకి ఇరువైపులా కూడా స్వస్తిక్ నీ వేయాలి. ఇలా చేయడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుంది.

సాయంత్రం పూట ఈ విధంగా చేయండి: సాయంత్రం పూజ గదిలో లైట్ వేసిన తర్వాత ముఖ ద్వారం దగ్గర కూడా లైట్ ని వెయ్యండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి ఈ విధంగా అనుసరించండి. దీనితో మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలరు. ఆర్ధిక ఇబ్బందులు కూడా వుండవు.

Read more RELATED
Recommended to you

Latest news