చాలా మంది సంపాదిస్తారు కానీ ఎక్కువగా డబ్బులు ఉండడం లేదని బాధ పడుతూ ఉంటారు. మీరు కూడా ఆలా సతమతం అవుతున్నారా..? అయితే అటువంటి సమస్యలు ఏమీ రాకుండా ఉండాలంటే వాస్తు పండితులు చెప్పిన ఈ అద్భుతమైన టిప్స్ ని పాటించడం మంచిది. వీటిని పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు మరియు ధనం నష్టం కలగకుండా కూడా ఉంటుంది.
ప్రతి రోజు దేవుడిని తలుచుకుని ఎలా అయితే ఈ నిద్రలేస్తామో రాత్రి నిద్ర పోయేటప్పుడు కూడా ఇష్టదైవాన్ని ప్రార్ధించి నిద్రపోవడం మంచిది. దీని వల్ల దేవుడి అనుగ్రహం మనకి కలుగుతుంది. అలానే ఇబ్బందులు ఏమీ రాకుండా ఉండాలంటే మంచం మీద పేపర్స్, వర్క్ మెటీరియల్స్ లాంటివి ఏమీ పెట్టుకోకూడదు. వాస్తు పరంగానే కాదు ఇది మనకి కూడా కాస్త ఇబ్బంది కలిగిస్తుంది.
అలానే నిద్ర పోయేటప్పుడు ఏ దిక్కులో నిద్రపోతున్నారు అనేది కూడా చాలా ముఖ్యం అని పండితులు చెప్తున్నారు. నిద్రపోయేటప్పుడు కచ్చితంగా దక్షిణ దిక్కు లో తలని పెట్టుకుని నిద్రపోవడం మంచిది అంటే ఉత్తర దిక్కు వైపు కాళ్ళు ఉండాలి.
ఇలా ఈ విధంగా చేయడం వల్ల వాస్తు దోషాలు కలగవు పైగా ధననష్టము ఉండకుండా ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. కాబట్టి ఈ వాస్తు టిప్స్ ని మీరు అనుసరించి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి.