వాస్తు టిప్‌..ఉప్పుతో మీ ఆర్థిక సమస్యలకు చెక్‌!

-

అన్ని ఉన్నా కూరల్లో ఉప్పు లేకుంటే అది తినటానికి పనికిరాకుండా పోతుంది. కేవలం వంటకు మాత్రమే కాదు ఉప్పు ద్వారా మనకు ఉండే ఆర్థిక సమస్యలను తొలగించవచ్చని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. అవును! ఇది నిజమే.. ఉప్పుతో మీకున్న ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు ఆచార్య ఇందు ప్రకాశ్‌ చెబుతున్నారు. ఆ విధానం ఏంటో తెలుసుకుందాం.

 

  • ముందుగా గ్లాస్‌ బౌల్‌లో ఉప్పును, నాలుగు లేదా ఐదు లవంగాలను అందులో వేసి మీ ఇంటిలో ఏదైనా ఒక మూలన ఆ ఉప్పు వేసిన బౌల్‌ను ఉంచండి. ఇలా తరచూ చేయడం వల్ల మీ ఇంటికి ధనాకర్షణ మొదలవుతుంది. అలాగే మీకు శుభాలు కలుగుతాయి.
  • గ్లాస్‌ బౌల్‌లో ఉప్పును ఉండచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలని తొలగిస్తుంది. అంతేకాదు ఇల్లు మొత్తం సువాసనతో శాంతియుతమైన వాతావరణం ఏర్పడుతుంది.
  • ఒకవేళ మీ ఇంటి టాయిలేట్‌కు సంబంధించి ఏదైనా నిర్మాణం లోపం ఉన్నా టాయిలేట్‌లో ఏదైనా మూలన కల్లుఉప్పు (రాక్‌ సాల్ట్‌) ని ఉంచాలి. అది ఎవరూ తాకని ప్రదేశంలో పెట్టి, కొన్ని రోజుల తరువాత ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగి మీ ఇంటికి పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news