వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం ఉంటుంది. చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. అయితే వాస్తు ప్రకారం ఫాలో అయితే ఎలాంటి సమస్య అయినా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వీటిని ఇంట్లో పెడితే చాలా మేలు కలుగుతుంది కాబట్టి ఈ జంతువులని ఇంట్లో ఉంచడం మంచిది. ఇంట్లో జంట ఏనుగులని పెడితే చాలా మేలు కలుగుతుంది. జంట ఏనుగులని ఇంట్లోకి తీసుకువస్తే కుటుంబంలో సఖ్యత కలుగుతుంది.
వైవాహిక జీవితంలో కూడా ఆనందమే ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సిల్వర్ రంగు లేదంటే కంచు ఏనుగులని తీసుకువచ్చి పెడితే చక్కటి ప్రయోజనం కలుగుతుంది. తాబేలుని కూడా ఇంట్లో పెట్టొచ్చు. తాబేలు విష్ణువుగా భావిస్తారు. తాబేలుని ఇంట్లో ఉంచడం వలన లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఉంటుంది. తూర్పు వైపు లేదంటే ఉత్తరం వైపు దీన్ని ఉంచండి చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం రెండు హంసలని కూడా పెడితే మంచిది డ్రాయింగ్ రూమ్లో కానీ బెడ్ రూమ్ లో కానీ హంసలని ఉంచండి భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే గుణం ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పాటుగా ప్రేమ కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం కూడా బాగుంటుంది.
చేపని కూడా ఇంట్లో ఉంచొచ్చు చేప బొమ్మను ఇంట్లో ఉంచడం వలన ధనం పెరుగుతుంది అదృష్టం ఉంటుంది. ఆవు బొమ్మను కూడా ఇంట్లో ఉంచితే మంచిది ఆనందం కలుగుతుంది ప్రశాంతత ఉంటుంది. ఒంటె ని కూడా ఇంట్లో పెట్టొచ్చు దీన్ని ఇంట్లో ఉంచడం వలన వ్యాపారం బాగుంటుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని వీటిని అనుసరించి ఏ బాధ లేకుండా ఆనందంగా జీవించండి.