VD12’ నుంచి శ్రీలీల అవుట్.. విజయ్‌కు జోడీగా యానిమల్ బ్యూటీ…..

-

జెర్సీ ఫేమ్ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ వీడీ12’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మార్చి నుంచి ‘వీడీ12’ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో కథానాయికగా మొద‌ట శ్రీలీల పేరు వినిపించిన విష‌యం తెలిసిందే.


అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం శ్రీలీల స్థానంలో బాలీవుడ్ ముద్దుగుమ్మా యానిమ‌ల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి కథానాయికగా ఎంపికైన‌ట్లు తెలుస్తుంది. మరోవైపు ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్‌ రుక్మిణీ వసంత్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయిన‌ట్లు సమాచారం. కాగా దీనిపై చిత్ర‌బృందం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో విజయ్‌ గూఢచారి పాత్రలో కనిపించనున్నారు.ప్రస్తుతం విజయ్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా చిత్రీకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. పరశురాం దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్ గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news