ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు అర్షనపల్లి జగన్మోహనరావు వెల్లడించారు. రెండు జట్లు రేపు (ఆదివారం) హైదరాబాద్ చేరుకుంటాయని చెప్పారు. ఆడియన్స్ కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మ్యాచ్ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.HCA నూతన అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మ్యాచ్ జరుగుతుండడంతో , ఆధునాతన హంగులతో స్టేడియాన్ని తీర్చి దిద్దామని వెల్లడించారు.
గణతంత్ర దినోత్సవం రోజున ఆర్మీ అధికారులు, తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు సదుపాయం కల్పించామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాల నుంచి ముందుగా అప్లయ్ చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు తాగునీటి సదుపాయం, ఉచిత భోజనము తో పాటు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.పాస్‌లు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని ,రోజుకు 5 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అనుమతిస్తామని, దీని కోసం 300 పైగా పాఠశాలల నుంచి అప్లికేషన్లు వచ్చాయను వెల్లడించారు.