వాహన తుక్కు పాలసీ.. కొత్త వాహనం కొంటే 5 శాతం రాయితీ..!

-

దేశవ్యాప్తంగా వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ధనవంతులు ఇంటికి రెండు, మూడు కార్లు కొంటున్నారు. మధ్యతరగతి కుటుంబీకులకు కూడా ఉన్న దాంట్లోనే కార్లు, బైకులు కొనాలనే కలలు కంటుంటాడు. వినియోగదారుల అవసరాలను బట్టి మార్కెట్‌లో పలు సంస్థలు కొత్త కొత్త వెరియంట్స్, డిజైన్, తక్కువ ధరతో కూడిన వాహనాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో వినియోగదారులు పాత వాహనాలను పక్కన పడేసి కొత్త వాటిపై మొగ్గు చూపుతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో పాత వాహనాల సంఖ్య పెరిగింది.

తుక్కు వాహనాలు
తుక్కు వాహనాలు

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీని పేరు వాహన తుక్కు పాలసీ. దేశ వాహనరంగంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పాత వాహనాల సంఖ్య పెరిగి ఇష్టారాజ్యంగా రోడ్లపై నిలిపివేస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకే వాహన తుక్కు పాలసీ తీసుకొచ్చామన్నారు.

వాహనదారులు తమ పాత వాహనాన్ని ఇష్టపూర్వకంగా తుక్కుగా మార్చితే.. కొత్త వాహనం కొన్నప్పుడు 5 శాతం రాయితీ అందిస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇలాంటి ఓ పాలసీని తీసుకొస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో తెలుపగా.. మంత్రి నితిన్ గడ్కరీ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. పాత వాహనాల నాణ్యత పరీక్షించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం (పీపీపీ)తో దేశవ్యాప్తంగా ఆటోమెటెడ్ ఫిట్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి పేర్కొన్నారు.

వాహనాలను తుక్కుగా మార్చేందుకు అవసరమైన కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామన్నారు. వాహనాలు ఫిట్‌నెస్ పరీక్షలో ఫెయిల్ అయితే వాటిపై గ్రీన్ ట్యాక్స్ వేస్తామన్నారు. దీంతోపాటు పాత వాహనం అనే కారణంతో అదనంగా జరిమానా విధిస్తామన్నారు. పాత వాహనాలు నడిపితే పెనాల్టీ భారం తప్పదని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కాబట్టి ఫిట్‌నెస్ లేని పాత వాహనాలను తుక్కుగా మార్చి.. కొత్త వాహనాలు కొనుగోలు చేయడమే ఉత్తమం అన్నారు. కాగా, ఈ పాలసీ చాలా మంచిదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ పాలసీ అమలుతో పాత వాహనాల బెడద తగ్గుతుందని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news