ఒక ఎన్నికలో ఓడినా మరో ఎన్నికలో గెలుస్తాం : మంత్రి వేముల

హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ అభ్యర్థి గెలు శ్రీనివాస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఎన్నికల్లో గెలుపు ఓట‌ములు సహజమని ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలను చూసి ఉందని ఆయన అన్నారు. అంతేకాకుండా తమ పార్టీ ఒక‌ ఎన్నికలో ఓడిపోయినా మ‌రో ఎన్నికలో విజయం సాధిస్తుందని ప్రశాంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

vemula prashanth reddy comments
vemula prashanth reddy comments

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తో పాటు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న సీటును కూడా గెలుచుకున్నామ‌ని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ రోజు ఉదయం వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమిపై స్పందించారు. ఇక మంత్రి కేటీఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే. కేవలం హుజురాబాద్ లో ఓడినంతమాత్రాన తమ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపించదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.