ప్రభుత్వ పథకాల అమలుపై వెంకయ్య నాయుడు ఫైర్.. అన్నీ ఫ్రీ అంటే ఎలా ?

-

ఇవాళ హైదరాబాద్ లోని జలవిహార్ లో అలయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహించారు బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయ లక్ష్మి. ఈ కార్యక్రమానికి దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధి గా హాజరు అయ్యారు. అయితే ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్ కొరత ఏర్పడి ఎన్ని ప్రాణాలు పోయాయో ఈ మధ్య చూసామని పేర్కొన్న ఆయన.. ప్రభుత్వాలు… సోంబేరి తనాన్ని ప్రోత్సహిస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

ప్రజలను చైతన్యవంతులను చేయాలి కానీ… ఫ్రీ ఫ్రీ అంటూ కూర్చో పెడితే ఎలా ??? అని ఫైర్ అయ్యారు వెంకయ్య నాయుడు. చేపలు పట్టడం నేర్పించాలి కానీ… ఉచితంగా చేప ఇస్తే… మధ్యాహ్నం బొచ్చ చేప తిని.. సాయంత్రం కొరమీను అడుగుతాడని చురకలు అంటించారు.

హరితహారం పేరిట మొక్కలు నాటుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని తాను అభినందిస్తున్నానని.. రాబోయే రోజుల్లో నీటి సమస్య కూడా వచ్చేలా ఉందన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకునేలా.. రైన్ వాటర్ హార్వెస్టింగ్ వైపు దృష్టి పెట్టాలని సూచనలు చేశారు వెంకయ్య నాయుడు. ఇవాళప్రకృతి ని మనం నిర్లక్ష్యం చేయడం వల్లే… ఇప్పుడు విపత్తులు వస్తున్నాయని.. అకాల వర్షాలు, కరోనా, తుఫానులు, కార్చిచ్చు… అన్నీ ప్రకృతి ప్రకోపమేనని చెప్పారు. విచ్చలవిడిగా చెట్లు కొట్టేస్తున్నాం… ఇప్పుడు మళ్లీ మొక్కలు నాటుతున్నాం… మరి కొట్టేటప్పుడు ఏమైంది తెలివి ? అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version