చంద్రబాబు ఒక పగటి వేషగాడు , పిట్టలదొర : కొడాలి నాని

-

చంద్రబాబు ఒక పగటి వేషగాడు , పిట్టలదొర అని మండిపడ్డారు ఏపీ మంత్రి కొడాలి నాని. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడని.. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడని ఫైర్ అయ్యారు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు చంద్రబాబు అని.. చంద్రబాబు సారధ్యంలో కొందరు దొంగలు ఇప్పటికే పర్యటనలు మొదలు పెట్టారన్నారు.

దేవినేని ఉమా సొల్లు కబుర్లు చెబుతుంటాడని.. తాను , వంశీ ఫోన్లు చేసినా ఎత్తడు..మా ఫోన్లు బ్లాక్ లో పెట్టేశాడని ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. దేవినేని ఉమా ఓ చవట దద్దమ్మ అని.. ఉమా పకోడీ బెదురింపులకు అధికారులెవరూ భయపడొద్దు …కేసులు పెట్టండి అని చెప్పారు ఏపీ మంత్రి కొడాలి నాని.

మీకు అండగా మేమున్నాం…అవసరమైతే ఉమాని ఓ పది రోజులు జైల్లో పడుకోబెట్టొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది తెలుగుదేశం సన్నాసులకు ఓ విషయం తెలియదని.. వైసీపీ అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారని.. వైసీపీ అంటే…టీడీపీ కంటే బలమైన మాస్ ఇమేజ్ ఉన్న శక్తివంతమైన పార్టీ అని పేర్కొన్నారు. గుడివాడైనా…మైలవరమైనా..ఎక్కడైనా వైసీపీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version