ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఈ విశ్వంలో ఏ మూలన ఉన్నా మన భాషా సంస్కృతులే మన నిజమైన చిరునామా అంటూ ట్వీట్ చేశారు. భవిష్యత్ తరాలకు మన భాషా సంస్కృతుల వైభవాన్ని అందించేందుకు తెలుగు వారంతా పునరంకితం కావాలని ఆకాంక్షించారు.
లండన్ పర్యటనలో ఉన్న ఆయన ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషను ప్రజలపరం చేసి, వాడుక భాషా ఉద్యమం సాగించిన గిడుగు రాంమూర్తి పంతులు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని చెప్పారు. గిడుగు చూపిన బాట ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని సూచించారు. అమ్మ భాష అందరి శ్వాస కావాలని పిలుపునిచ్చారు. ఎల్లలు దాటి తెలుగు వెలుగులు ప్రసరించాలని పేర్కొన్నారు.
ఆత్మ విశ్వాసం పెంచే అమ్మ భాషను ప్రాథమిక విద్యలో పరిపాలనా భాషగా, న్యాయ స్థానాల కార్యకలాపాలు, సాంకేతిక విద్యలోనూ, కుటుంబ సభ్యులతో మాట్లాడే భాషగా వినియోగించడమే గిడుగు వారికి ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.
ఆత్మవిశ్వాసాన్ని పెంచే అమ్మ భాషను ప్రాథమిక విద్యలోనూ,పరిపాలనా భాషగా,న్యాయస్థానాల కార్యకలాపాల్లోనూ,సాంకేతిక విద్యలోనూ,కుటుంబసభ్యులతో మాట్లాడే భాషగానూ వినియోగించడమే శ్రీ గిడుగు వారికి ఇచ్చే నిజమైన నివాళి.ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తున్నాను#TeluguLanguageDay pic.twitter.com/jfKxVb3hV1
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 29, 2022