నెక్స్ట్ నేనే సీఎం అవుతా: MLA వెంకట రమణా రెడ్డి

-

2028లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాబోతుందని నేనే సీఎం అవుతారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈరోజు ఆయన కామారెడ్డిలో మీడియా తో మాట్లాడారు నా జోలికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తుందన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలన లో ప్రభుత్వాసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని అన్నారు దోమకొండలో 100 పడకల ఆసుపత్రిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు.

ఇద్దరు సీఎంలపై గెలిచిన తనని ఆషామాషీగా తీసుకోవద్దని కాటిపల్లి వెంకటరమణారెడ్డి మండిపడ్డారు ప్రస్తుతం వెంకట రమణ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. 2028లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం అని అన్నారు అలానే నేనే సీఎం అవుతానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news