ఖమ్మం కాంగ్రెస్ సీట్ కోసం పోటాపోటీ.. టిక్కెట్ ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకుంటున్న ఓ సీనియర్ నేత..

-

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది.. టిక్కెట్ల వేటలో పడ్డారు అభ్యర్థులు.. కచ్చితంగా గెలిచే సీట్లపై కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖులు కన్నేశారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిది చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.. పార్టీ కూడా అధికారంలో ఉండడంతో ఈ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. అధిష్టానం పెద్దలతో ఇప్పటికే లాబింగ్ లు చేస్తున్నారట..

నామినేషన్ వేస్తే చాలు కచ్చితంగా ఎంపీగా గెలవడం ఖాయం అనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు.. దీంతో ఖమ్మం కాంగ్రెస్ సీటుపై నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.. ఖమ్మం నుంచి సోనియా లేదా రాహుల్ పోటీ చేస్తారంటూ ఈ మధ్యకాలంలో బాగా ప్రచారం జరిగింది.. అయితే వారు అక్కడ పోటీ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆశావాహులకు ఆశలు రెట్టింపు అయ్యాయి.. ఖమ్మం టికెట్ కోసం మొదటి నుంచి గట్టిగా పట్టు పట్టిన రేణుక చౌదరిని కాంగ్రెస్ పెద్దలు రాజ్యసభకు పంపారు. ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న ముగ్గురు మంత్రులు ఖమ్మం సీటుపై కన్నేశారు.. తమ కుటుంబ సభ్యులకు ఆ సీటును కేటాయించుకుని గెలిపించుకోవాలనా ముగ్గురు నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట..

రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ప్రసాద్ రెడ్డి అలాగే తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్లు ఖమ్మం టికెట్ ను ఆశిస్తున్నారు.. వీరితోపాటు కొత్తగా పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు స్క్రీన్ మీదకు వచ్చారు.. తనకు ఖమ్మం సీటు దక్కకుండా రాష్ట్రం మంత్రులు అడ్డుపడుతున్నారని.. ఖమ్మం నుంచి గెలవడం తన కలంటూ ఆయన మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు.. అధిష్టానం పెద్దలు తన భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. మరోపక్క తుమ్మల కుమారుడు యుగంధర్ , మిగిలిన నేతలు తమకు టిక్కెట్ ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారట.. గెలిచే సీటు కావడంతో ఖమ్మం సీటు తమకంటే తమకంటూ చాప కింద నీరులా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది.. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో హాట్ కేక్ ల ఉన్న ఖమ్మం సీటు ఎవరిని వరిస్తుందో చూడాలి మరి

Read more RELATED
Recommended to you

Latest news