అమరావతి ప్రేమికులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్..!

-

అమరావతి.. ఏపీ రాజధాని.. ఆరు నెలల వరకూ అమరావతి అంటే ఉన్న క్రేజ్ వేరు. అప్పటి సీఎం చంద్రబాబు అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా రూపుదిద్దుతామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఎన్నో ఊహా చిత్రాలు విడుదల చేసారు. అవి చూసి అమరావతిని ఏపీ జనం ఓ రేంజ్ లో ఊహించుకున్నారు.

అమరావతి అభివృద్ధి భాగస్వాములయ్యేందుకు చాలా దేశాలు ముందుకొచ్చాయని అప్పట్లో చెప్పారు. సింగపూర్ ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. 2017లో అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. కానీ 2017లోనే ఒప్పందం కుదిరినా.. 2019 వరకూ అంటే రెండేళ్ల పాటు పెద్దగా అడుగులు ముందుకు పడలేదు.

అమరావతి లోని కీలకమైన 6.84 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యం తో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టారు. కానీ ఆరు నెలల తర్వాత ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. అసలు రాజధాని అమరావతిలోనే ఉంటుందా.. లేక తరలిపోతుందా అన్న ఆందోళన అమరావతి ప్రేమికులను పట్టిపీడిస్తోంది.

బొత్స సత్యనారాయణ వంటి మంత్రుల ప్రకటనలు ఇందుకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి ప్రేమికులకు సింగపూర్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాజధానిలోని స్టార్ట్ అప్ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. పరస్పర అంగీకారం మేరకు సింగపూర్ కన్సార్షియమ్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు సింగపూర్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.

ఏపీలో సీన్ అర్థం చేసుకున్న సింగపూర్ కూడా ఈ ఒప్పందం గురించి పెద్దగా ఉత్సాహంగా లేదు. మొత్తానికి ఈ ఒప్పందాన్ని రెండు ప్రభుత్వాలు పరస్పర అంగీకారం మేరకు రద్దు చేసుకున్నాయి. రాజధాని అమరావతి ఉండాలనుకునేవారికి ఇది నిజంగా చేదువార్తే.

Read more RELATED
Recommended to you

Latest news